Border Gavaskar Trophy: 144 పరుగుల ఆధిక్యంతో టీమ్ ఇండియా

నాగ్‌పూర్ (CLiC2NEWS): నాగ్‌పూర్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 177 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (120) సెంచరీ చేయగా.. రవీంద్ర జడేజా 66* అక్షర్ పటేల్ 52* అర్థ సెంచరీలు చేశారు.