IND vs NZ: కివీస్‌పై భారత్ గెలుపు
ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్..
వాంఖడే (CLiC2NEWS): టీమ్ ఇండియా న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 327 పరుగులకు ఆలౌటయింది. దీంతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షమీ కివీస్ జట్టు వికెట్లు పడగొడుతూ.. భారత్ విజయానికి కారణమయ్యాడు.
న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన ఆరంభంలోనే 34 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు రెండో వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. దీంతో ఇద్దరు ఓపెనర్లూ ఔటయ్యారు. డారిల్ మిచిల్ (134) 85 బంతుల్లో సెంచరీ సాధించాడు. , వియమ్సన్ 69, గ్లెన్ ఫిలిప్స్ 37 పరుగులు చేశారు.
[…] IND vs NZ: కివీస్‌పై భారత్ గెలుపు […]