దాయాదుల జట్టుపై భారత్ విజయం

IND vs PAK: భారత్, పాక్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 42.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి పాక్‌పై విజయం సొంతం చేసుకుంది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. కోహ్లీ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ 20, గిల్ 46 , శ్రేయాస్ అర్దసెంచరీ ( 56) సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 241 పరుగులకు ఆలౌటైయింది.