IND vs SA: 243 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం
83 పరుగులకే కుప్పకూలిన సౌత్ ఆఫ్రికా.

కోల్‌కత్తా (CLiC2NEWS): వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.
ఈడెన్ గార్టెన్‌లో జరుగిన భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరులో టీమ్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. 243 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. 83 పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూలిపోయింది.
327 పరుగుల లక్ష్యంతో సఫారీలు బరిలోకి దిగారు. కానీ ఆదిలోనే సఫారీలకు ఎదురెబ్బ తగిలింది. ఆరు పరుగులకే వికెట్ కోల్పోయింది. అనంతరం వరుసగా 22 పరుగులకు రెండో వికెట్, 35 పరుగుల వద్ద మూడో వికెట్ , 40 పరుగులకే 4వ వికెట్ కోల్పోయింది. వెంటనే 42 పరుగులకు 5వ వికెట్.. 59 పరుగుల వద్ద 6వ వికెట్, 67 పరుగులకు 7వ వికెట్ నష్టపోయింది. 79 పరుగులకు 8, 9వ వికెట్‌లు కోల్పోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్ 77 పరుగులు, గిల్ 23, రోహిత్ 40 చేశారు. విరాట్ తన పుట్టిన రోజును మరిచిపోలేని రోజుగా చరిత్ర రాశాడు. సచిన్ వన్డే సెంచరీ రికార్డును సమం చేశాడు. ఈ సందర్బంగా సచిన్ ట్వీట్.. రికార్డును సమం చేయడమే కాదు.. బ్రేక్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదు అంటూ ట్వీట్ చేశాడు.