IND vs SL: లంకేయుల‌పై 238 పరుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం

బెంగ‌ళూరు (CLiC2NEWS): భార‌త్ , శ్రీ‌లంక మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీ‌లంక‌పై 238 పరుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. టీమ్ ఇండియా జ‌ట్టు 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 252 ప‌రుగులకు ఆలౌట‌యింది , రెండో ఇన్నింగ్స్ లో 303 ప‌రుగులు చేసింది. శ్రీ‌లంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట‌యింది. 447 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. క‌రుణ ర‌త్నె 107 శ‌త‌కం సాధించాడు. కుశాల్ మెండిస్ 54, డిక్వెల్లా 12 ప‌రుగులు చేశారు.

Leave A Reply

Your email address will not be published.