IND vs SL: రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్..
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 574/8 డిక్లేర్డ్
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 574 /8 స్కోర్ డిక్లేర్డ్ చేసింది. భారత్ రెండో రోజు ఆటలో 357 /6 ఓవర్‌నైట్ స్కోర్‌తో కొనసాగించి 217 పరుగులు జోడించింది. మరో రెండు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా 175 (నాటౌట్) పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కపిల్ దేవ్ (163) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.