ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న భారత్
10 వికెట్ల తేడాతో లంకపై భారత్ విజయం
Asia cup 2023: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధింది. దీంతో భారత్ ఎనిమిదో ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. భారత్ బౌలర్ల ధాటికి లంక 50 పరుగులకే ఆలౌటయింది. స్వల్ప లక్ష్యం టీమ్ ఇండియాకు సునాయాసంగా విజయం తెచ్చిపెట్టింది. శుభ్‌మన్ గిల్ 27, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేశారు.