114 పరుగులకే విండీస్‌ను కట్టడి చేసిన భారత్‌జట్టు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/IND-vs-WI-MATCH.jpg)
బార్బడోస్ (CLiC2NEWS): 114 పరుగులకే విండీస్‌ను టీమ్ ఇండియా జట్టు కట్టడిచేసింది. 23 ఓవర్లకు విండీస్ 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి ఆలౌటయింది.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్యం తొలి వన్డే ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ బ్యాటర్స్ 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు. భారత బౌలర్టు జడేజా 3 వికెట్లు తీయగా.. హార్దిక్, శార్దూల్, కుల్దీప్ ఒక్కొక్క వికెట్ తీశారు. టీమ్ ఇండియా జట్టు ఇటీవల టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్దే ప్రారంభమైంది.
ఇప్పటివరకు ఇరు జట్లు 139 వన్డేల్లో తలపడ్డాయి. వాటిలక్ష భారత్ 70 మ్యాచ్‌లలో విజయం సాధించింది. విండీస్ 63 వన్డేల్లో గెలిచింది. నాలుగు వన్డేలు రద్దవ్వగా.. మరో రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి.