టి 20 మ్యాచ్లో భారత్  జట్టు ఘన విజయం

ఢాకా (CLiC2NEWS): బాంగ్లాదేశ్ తో జరిగిన తోలి టి 20  మ్యాచ్లో  భారత్   జట్టు బాంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ జట్టు 114  పరుగులకే ఆలౌటైంది.  115 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన భారత్ జట్టు 16  ఓవర్లలోనే ఛేదించింది. హర్మన్ ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ మొదటి విజయంతో భారత్ 1౦ ఆధిక్యంలో ఉంది. రెండో టి 20 మ్యాచ్ ఈ నెల 11 న జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.