విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవ పోటీలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సృజనాత్మక కలిగిన విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాస రచన, క్విజ్‌ పోటీలు తెలంగాణ ప్రభుత్వ జవహార్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • వర్తమాన స్వాతంత్య్ర భారత ముఖచిత్రం అనే అంశం ఆధారంగా కళాఖండాలను చిత్రించి ఫోటో తీసి 9848747432 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించాలని సూచించారు.
  • తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు-వారి నుండి పొందిన స్పూర్తి అశంపై వ్యాసాలను 30 లైన్లకు మించకుండా రాసి 9490316725 నెంబర్‌కు వాట్సాప్‌లో పంపించాలన్నారు.
  • భారత శాస్త్రవేత్తలు వారు సాధించిన విజయాలు అనే అంశంపై క్విజ్‌ పోటీలకు 9505054544కు పంపించాలని సూచించారు.
  • ఈ నెల 14లోపు విద్యార్థులు తమ అంశాలకు సంబంధించిన వివరాలను పంపించాలని కోరారు. ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు.
Leave A Reply

Your email address will not be published.