భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకారం..

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. దీంతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ స్థాయిలో రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్ డిజిఎంఒ భారత డిజిఎంఒకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణక ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5గంటల నుండి ఇది అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం డిజిఎంఒలు మళ్లీ చర్చలు జరుపనున్నట్లు సమాచారం.