సెమీఫైనల్‌లో ఆసీస్‌పై భారత్ విజయం..

దుబాయ్ (CLiC2NEWS): ఆసీస్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. 48.1 ఓవర్లలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 84 పరుగులు చేశారు. సెమీ ఫైనల్‌లో సెంచరీ చేస్తాడనుకున్న కింగ్ అభిమానులకు నిరాశే మిగిలింది. 42.4 ఓవర్‌కు డ్వార్షుయిస్‌కి క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ 42, శ్రేయస్ 45, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, హార్దిక్ 28 పరుగులు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 265 పరుగుల వద్ద ఆలౌటయింది.