ఆసీస్‌పై భార‌త్ 295 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం

Border-Gavaskar Trophy: బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంలో తొలిటెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. పెర్త్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ 295 భారీ తేడాతో విజ‌యం సొంతం చేసుకుంది . ఆసీస్ గ‌డ్డ‌పై భార‌త్‌కిదే అతిపెద్ద విజ‌యం. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 534 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందించిన సంగ‌తి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఓవ‌ర్‌నైట్ స్కోర్ 12/3 స్కోర్‌తో నాలుగో రోజు ఆట‌ ప్రారంభించిన ఆసీస్ 238 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. సిరాజ్‌, బుమ్రా చెరో 3 వికెట్లు తీయ‌గా.. వాష్టింగ్ట‌న్ సుంద‌ర్ 2, నితీశ్ , హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కెప్టెన్ బుమ్రా నిలిచాడు.

భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ .. తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగులు చేసి ఆలౌట‌యింది. రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్ల న‌ష్టానికి 487 ప‌రుగులు చేసింది.

ఆస్ట్రేలియా జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 104 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. రెండో ఇన్నింగ్స్‌లో 238 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది.

Leave A Reply

Your email address will not be published.