ఛాంపియ‌న్స్ ట్రోఫి భార‌త్ కైవ‌సం

న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం

IND vs NZ:  ఛాంపియ‌న్స్ ట్రోఫి ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 252 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రోహిత్ సేన 49 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ లో భాగంగా న్యూజిలాండ్-భార‌త్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ జ‌ట్టు 49 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శ‌ర్మ 76 ప‌రుగులు చేశాడు. గిల్ 31, శ్రేయాస్ 48, రాహుల్ 34, అక్ష‌ర్ ప‌టేల్ 29 , పాండ్య 18 ప‌రుగుల‌తో రాణించారు. కీల‌క మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప‌రుగులు చేయ‌కుండానే వెనుదిరిగి నిరాశ‌ప‌రిచాడు.

 

Leave A Reply

Your email address will not be published.