India Corona: కొత్తగా 91,702 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు లక్షకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కు పెరిగింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,34,580 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా రికవరీలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,77,90,073 మంది బాధితులు కోలుకున్నారు.
కొత్తగా దేశంలో మరో 3,403 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి మొత్తం 3,63,079 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11,21,671 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.