India Corona: తగ్గిన కరోనా తీవ్రత

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్‌ విడుదల చేసింది. కొత్త కేసులతో క‌లిపి దేశంలో న‌మోదైన మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 2,95,70,881కు పెరిగింది.

  • గడిచిన 24 గంటల్లో 2,726 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,77,031 మంది కరోనాతో మరణించారు.
  • గత 24 గంటల్లో 1,17,525 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,82,80,472 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
  • దేశంలో ప్రస్తుతం 9,13,378 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Leave A Reply

Your email address will not be published.