India Corona: తగ్గిన కేసులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలోని ప‌లురాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేసిన క‌ఠిన ఆంక్ష‌ల ఫ‌లితంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. మహమ్మారి తీవ్రత దేశంలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 84,332 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ క‌రోనా బులిటెన్ విడుదల చేసింది..
తాజాగా నమోదైన కేసులతో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,59,155కు పెరిగింది. కొత్త‌గా 1,21,311 బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,79,11,384 మంది బాధితులు కోలుకున్నారు.

గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 4,002 మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,67,081కు చేరింది. ప్రస్తుతం దేశంలో 10,80,690 యాక్టివ్‌ కేసులున్నాయి.

Leave A Reply

Your email address will not be published.