India Corona: తగ్గిన కరోనా కేసులు.

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 173,921 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా మరో 3,563 మంది కరోనాతో మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 3,18,821 మంది మరణించారు. ఇదే సమయంలో 2,84,601 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు రికవరీ కేసులు 2,51,78,011కు పెరిగాయి. తాజా కేసులతో కలిపి మొత్తం ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,19,431కు చేరింది.