India Corona: 1,32,788 కేసులు.. 2,31,456 రికవరీలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి రోజువారీ కేసుల నమోదు స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832కు పెరిగింది.
కొత్తగా దేశవ్యాప్తంగా 2,31,456 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 2,61,79,085 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో వైరస్ బారినపడి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారని బులిటెన్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,35,102 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.