India Corona: కొత్తగా 15,981 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనా బులిటెన్ వెల్లడించింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,40,53,573 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో 17,861 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 2,01,632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో 8,36,118 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇప్పటి వరకు దేశంలో 97,23,77,045 మందికి వ్యాక్సిన్ వేశారు.