India Corona: దేశంలో కొత్తగా 16,135 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసులు 4,35,18,564కు చేరాయి. వీరిలో ఇప్పటి వరకు 4,28, 79,477 మంది కోలుకున్నారు.
గత 24 గంటల వ్యవధిలో దేశంలో 24 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి 5,25,223 మంది మరణించారు.
గత 24 గంటల వ్యవధిలో దేశంలో 13,958 మంది కోలుకున్నారు.