India Corona: దేశంలో కొత్తగా 2,226 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 4,42,681 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,226 మందికి పాజిటివ్‌గా తేలింది.
గడిచిన 24 గంటల్లో కరోనాతో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,413 మందికి చేరింది.
కొత్తగా 2202 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో 14,955 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.