India Corona: 2,49,691 కేసులు.. 2767 మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం కేంద్రం కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 2,17,113 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారు 1,40,85,110 మంది. ప్రస్తుతం దేశంలో 26,82,751 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2767 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,92,311కి చేరింది.