India Corona: కొత్తగా 2,568 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో వరుసగా రెండో రోజు కూడా 3 వేలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా బారిన పడి 97 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా కరోనానుంచి 4,722 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 33,917 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 5,15,974 మంది మరణించారు.