India Corona: దేశంలో కొత్తగా 34,457 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి అదుపులో ఉంది. నిన్నటి రోజుతో పోలిస్తే కరోనా కేసుల నమోదు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది.
- గత 24 గంటల వ్యవధిలో 375 మంది మరణించారని వెల్లడించింది. దీంతో ఇండియాలో
- ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,33,964 కి చేరింది.
- గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 36,347 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,15,97,982 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
- ప్రస్తుతం దేశంలో 3,61,340 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.