India Corona: కొత్తగా 35,662 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుద ల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది.
- ప్రస్తుతం దేశంలో 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 33,798 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ఇక కరోనా వ్యాక్సినేషన్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు.
- గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.