India Corona: 3,79,257 కొత్త కేసులు.. మరణాలు 3,645

న్యూఢిల్లీ(CLiC2NEWS, ఎప్రిల్ 29): దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వివరాలు వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. ఇందులో 1,50,86,878 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 17,68,190 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. ఏప్రిల్ 28 వరకు దేశంలో మొత్తం 28,44,71,979 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
తాజాగా కరోనా మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 3,645 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత మంది బాధితులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా మరణాలు 2,04,8320కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 30,84,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మహారాష్ట్రలో నిన్న 63,309 కరోనా కేసులు నమోదవగా 985 మంది మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 29,824, ఢిల్లీలో 25,986 మంది కరనాబారినపడ్డారు. కర్ణాటకలో 39,047, కేరళలో 35,103 కేసులు కొత్తగా నమోదయ్యాయి.