India Corona: కొత్త‌గా 44,230 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 44,230 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,15,72,344 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 555 మంది మ‌ర‌ణించారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,23,217కు చేరింది.
  • అలాగే తాజాగా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972 చేరింది.
  • ప్ర‌స్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • ఇక 45.60 కోట్ల మందికి పైగా కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.
Leave A Reply

Your email address will not be published.