India Corona: 30 వేల దిగువకు కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 3,84,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 338 మంది మృతిచెందారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,42,655 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- దేశంలో ఇక ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.