India Corona: దేశంలో 8 వేలకు పైనే కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 4,32,30,101కు చేరాయి. వీటిలో 4,26,57,335 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,771 మంది మరణించారు. మరో 47,995 కేసులు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 10 మంది మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 4,592 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.