India Corona: కొత్త‌గా 13,091 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో స్వ‌ల్ప హెచ్చుత‌గ్గుల‌తో కరోనా కేసులు వ్యాప్తి కొన‌సాగుతోంది. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ అధికమయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 13,091 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ గురువారం క‌రోనా బెలిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,670కి చేరింది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,38,00,925 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 1,38,556 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 4,62,189 మంది క‌రోనాతో మృతిచెందారు.
  • గత 24 గంటల్లో కొత్త‌గా క‌రోనాతో 340 మంది మరణించారు.
  • అలాగే గ‌త 24 గంట‌ల్లో 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Leave A Reply

Your email address will not be published.