India Corona: కొత్తగా 40,134 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 40,134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.
- కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు.
- మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
- ఇప్పటి వరకు దేశంలో 47,22,23,639 టీకాలు వేశారు.
- గత 24 గంటల్లో 17,06,598 డోసులు వేసినట్లు బులిటెన్‌లో వివరించారు.