India Corona: కొత్త‌గా 41,831 కేసులు.. 541 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గ‌త కొన్ని రోజులుగా కొత్త కేసులు, మ‌ర‌ణాల్లో హెచ్చు త‌గ్గులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా
41,831 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజాగా వైరస్ బారిన పడి మరో 541 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,24,351 కి చేరింది.
  • తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,55,824 కి చేరింది.
  • తాజాగా మరో 39,258 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 97.36శాతానికి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారు 3,08,20,521 మంది.
  • ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్​ కేసులు 4,10,952 ఉన్నాయి.
  • దేశంలో ఇప్పటివరకు 47,02,98,596 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 60,15,842 డోసులు అందించినట్లు తెలిపింది.
Leave A Reply

Your email address will not be published.