వరుసగా రెండో సారి పొట్టికప్ భారత్ కైవసం
IND vs NZ: అహ్మదాబాద్ వేదికగా పొట్టికప్ ను సొంతం చేసుకుంది భారత్ జట్టు. టి20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకు ఆలౌటయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 255/5 స్కోర్ సాధించింది.
టిమ్ సీఫెర్ట్ 52, శాంట్నర్ 43, మిచెల్ 17 పరుగులు చేశారు. పటేల్ 3, బూమ్రా 4 వికెట్లు తీయగా.. పాండ్య, వరుణ్ చెరో వికెట్ తీశారు.
మూడో సారి కప్ సొంతం చేసుకుని అత్యధిక సార్లు టి20 ప్రపంచ కప్ నెగ్గిన తొలి జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఉన్నాయి.