శ్రీ‌లంక‌కు భార‌త్ మ‌రో 500 మిలియ‌న్ల డాల‌ర‌ల సాయం

కొలంబొ (CLiC2NEWS): ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీ‌లంకకు భార‌త్ సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇంధ‌న దిగుమ‌తుల నిమిత్తం మ‌రో 500 మిలియ‌న్ డాల‌ర్ల క్రెడిట్‌లైన్ అందించేందుకు సిద్ధ‌మైంది. ఈ విష‌యాన్ని శ్రీ‌లంక ఆర్ధిక మంత్రి అలీ స‌బ్రీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. విదేశీ మార‌క నిల్వ‌లు పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో వివిధ నిత్యావ‌స‌రాల దిగుమ‌తుల్లో శ్రీ‌లంక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భార‌త్ ఇప్ప‌టికే ప‌లుమార్లు క్రెడిట్‌లైన్ రూపంలో పెద్ద‌మొత్తంలో రుణాన్ని మంజూరు చేసింది. అలాగే 1.5 బిలియ‌న్ డాల‌ర్లు విలువ చేసే దిగువ‌తుల చెల్లింపుల గ‌డువును వాయిదా వేసేందుకు అంగీక‌రించింది. 400 మిలియ‌న్ డాల‌ర్ల క‌రెన్సీ బ‌దిలీ కాల‌ప‌రిమితిని సైతం పొడిగించింది.

రానున్న తొమ్మిది నెల‌లు చాలా క్లిష్టంగా గ‌డ‌వ‌నున్నాయ‌ని స‌బ్రీ తెలిపారు. ఆ స‌మ‌యంలోగా భారీ ఎత్తున పెట్టుబ‌డుల‌ను అమెరికా డాల‌ర్ల రూపంలో శ్రీ‌లంక సెంట్ర‌ల్ బ్యాంక్‌కు చేర్చాల్సి ఉంద‌ని తెల‌పారు. వివిధ దేశాల‌తో జ‌రుపుతున్న చ‌ర్చలు ఫ‌లించి క‌నీసం 2 బిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను స‌మాకూర్చుకోగ‌లిగితే.. సంక్షోభాన్ని నివారించి శ్రీ‌లంక రూపాయిని స్థిర‌ప‌ర్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.