సింధూ జలాల ఒప్పందం నిలిపివేత: భారత్

Operation Sindoor: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నిలిపివేసింది.
ప్రపంచ దేశాల నుండి సంప్రదింపులు జరిపి కాల్పుల విరమణపై భారత్ వైఖరి స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అణచివేయడమే భారత్ ప్రాథమిక లక్ష్యం. ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేయగా.. పాక్ కాల్పులకు దిగింది. దానికి ప్రతి చర్యగా భారత్ దాడులుచేసింది. పాక్ కాల్పులు నిలిపివేస్తే భారత్ దాడులు ఆపేస్తుందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలిపింది. ప్రపంచ దేశాలు పాక్‌కు ఈ విషయాన్ని చెప్పి ఉంటారని.. అయితే పాక్ ఈ విషయాన్ని పెడచెవిన పెట్టిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని భారత్ తెలిపింది. ద్వైపాక్షిక చర్చలు తప్ప మరెలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగాకరించదని స్పష్టం చేసింది.