ఇరుదేశాల మ‌ధ్య శాంతి నెల‌కొల్పేందుకు భార‌త్ సిద్ధంగా ఉంది

కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా ఆ దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్బంగా ఉక్రెయిన్ -ర‌ష్యా మ‌ధ్య నెల‌కొన్న వివాదాన్ని చ‌ర్చ‌లు, దౌత్య మార్గాల ద్వారానే ప‌రిష్క‌రించుకోవాల‌ని భార‌త్ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. శాంతి నెల‌కొల్పేందుకు అన్ని విధాల స‌హ‌క‌రించేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని మోడీ స్ప‌ష్టం చేశార‌ని భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ తెలిపారు.

సైనిక స్థితిగ‌తులు, ఆహార‌, ఇంధ‌న భ‌ద్ర‌త‌తో పాటు శాంతిని నెల‌కొల్పే మార్గాల‌పై ఇరు దేశాల నేత‌లు సుదీర్ఘంగా చ‌ర్చించార‌ని అన్నారు. మ‌రోవైపు, గ్లోబ‌ల్ పీస్ స‌మ్మిట్ లో త‌న భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించాల‌ని భార‌త్‌ను ఉక్రెయిన్ కోరిన‌ట్లు వెల్ల‌డించారు. రష్యా అధ్య‌క్షుడి పుతిన్ తో జ‌రిపిన చ‌ర్చ‌ల వివ‌రాల‌ను జెలెన్‌స్కీకి వివ‌రించార‌ని.. అంత‌ర్జాతీయ న్యాయ సూత్రాల‌కు అనుగుణంగా స‌హ‌కారం అదించుకునేందుకు ఇరువురు నేత‌లు త‌మ సంసిధ్ద‌త‌ను వ్య‌క్తం చేశార‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.