భార‌త్‌-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో రూ. 30వేల కోట్ల ఖ‌ర్చుతో కంచె!

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త్‌- మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో అక్ర‌మ చొర‌బాట్లు నిరోధించేందుకు కంచె నిర్మించ‌నున్న‌ట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్ర‌క‌టించారు. అయితే ఈ కంచె నిర్మాణానికి దాదాపు రూ. 30 వేల కోట్ఉల ఖ‌ర్చ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే దీనికి సంబంధ‌దించిన ప‌నులు కూడా ప్రారంభ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో 1600 కిలోమీట‌ర్ల మేర ఫెన్సింగ్‌కు ఈ మొత్తాన్ని వెచ్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఒక్కో కిలోమీట‌రుకు రూ. 12 కోట్లు చొప్పున ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప‌లు ఆంగ్ల మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. 2020లో బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో ఏర్పాటు చేసిన కంచె ఖ‌ర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు అని తెలిపాయి. అయితే దీనిని కేంద్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.