కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. ట్రంప్

వాషింగ్టన్ (CLiC2NEWS): భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ పోస్ట్ చేసిన కొంతసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కొ రుబియో సైతం ఇదే తరహా ప్రకటన చేశారు.
అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్ , పాక్ అంగీకరించాయి. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయన్నారు. అందుకు ధన్యవాదాలు అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత్ , పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని.. ఇరు దేశాల ప్రధానులు, భారత విదేశాంగ శాఖ మంత్ఇ జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మి స్టాప్ అసిమ్ మునీర్ , ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి తెలిపారు. తాను మరియు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు.
భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకారం..