భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి: సిడిఎస్ అనిల్ చౌహాన్
Operation Sindoor: భారత్ 365 రోజులూ అప్రమత్తంగా ఉండాలని సిడిఎస్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. యుద్దాల గతి మారిపోతుందని.. భవిష్యత్తులో దళాల్లో ఇన్ఫో-టెక్తో పాటు స్కాలర్ వారియర్స్ కలగలసి ఉంటాయన్నారు. ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ పూర్తిగా అప్‌డేట్ అయి ఉండాలని అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన గుర్తు చేశారు. ఏ క్షణమైనా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సిడిఎస్ అన్నారు.
భారత మిలిటరీకి భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ వారియర్స్, టెక్నాలజి వారియర్స్, స్కాలర్ వారియర్స్ అవసరం ఉందన్నారు. మారుతున్న పరిణామాల ఆధారంగా.. భవిష్యత్తు సైనికులు ఈ మూడు నైపుణ్యాలల కలబోతగా ఉంటారని పేర్కొన్నారు. యుద్దాల్లో రన్నరప్‌లు ఉండరని.. సైన్యాలు ఆప్రమత్తంగా ఉండాలన్నారు.
సైనిక దళాల్లో జరుగుతున్న మార్పులు.. మూడో విప్లవం కీలక దశలో మనం ఉన్నట్లు వెల్లడించారు. దీనిని కన్వర్జెన్సీ యుద్దంగా ఆయన అబివర్ణిస్తానన్నారు. ఇది కైనటిక్, నాన్-కైనటిక్ మిశ్రమంగా ఉంటుందన్నారు.