IND vs SA: ఆఖరి పోరు వర్షార్పణం
2-2తో సిరీస్ పంచుకున్న ఇండియా- దక్షిణాఫ్రికా
బెంగళూరు (CLiC2NEWS): అయిదు మ్యాచ్ల టి20 సిరీస్ లో ఆఖరి వన్డే వరుణుడి దెబ్బకు రద్దయింది. చివరి వన్డే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సజావుగా సాగడంపై ముందునుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ కనీసం కొన్ని ఓవర్లయినా ఆట సాగి సిరీస్ ఫలితం వస్తుందేమో అనే ఆశతో వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. టైమ్ ప్రకారం టాస్ వేయడం.. టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో అనుకున్న ప్రకారమే మ్యాచ్ కొనసాగుతుందని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే వర్షం ముంచెత్తింది. దీంతో 50 నిమిషాలు ఆలస్యంగా ఆట ఆరంభమైంది. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. భారత్ 3.3 ఓవర్లలో 28/2 స్కోరు వద్ద ఉన్న సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. ఇషాన్ కిషన్ (15), రుతురాజ్ గైక్వాడ్ (10) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్ల రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత వరుణుడు శాంతించకపోవడంతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
నాలుగు మ్యాచ్ల్లో పొదుపుగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టిన భారత ఫేసర్ భువనేశ్వర్ కుమార్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.