India vs US trade war: ప్ర‌తీకార చ‌ర్య‌లు ఉండ‌వు..

అమెరికా సుంకాల‌పై భార‌త్ నిర్ణ‌యం!

న్యూఢిల్లీ(CLiC2NEWS): అగ్ర‌రాజ్యం అమెరికా.. త‌న‌కు భార‌త్ మిత్ర‌దేశ‌మంటూనే భారీగా సుంకాలు, పెనాల్టీలు విధించింది. అంత‌టితో ఆగ‌కుండా భార‌త్ – ర‌ష్యా స్నేహంపైనా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న అక్క‌సును వెల్ల‌గ‌క్కాడు. ఇప్పుడిప్పుడే అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతున్న భార‌త్‌పై అమెరికా 25 శాతం సుంకాలు, పెనాల్టీలు విధించ‌డంపై ఇండియా స్పంద‌న‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ సానుకూలంగానే స్పందించింది.

అమెరికా సుంకాల నేప‌థ్యంలో ఆ దేశంపై ఎలాంటి ప్ర‌తీకార చ‌ర్య‌లుండ‌వ‌ని అధికార వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపాయి.

అమెరికా నిర్ణ‌యంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ పార్ల‌మెంటులో స్పందించారు. అమెరికాతో చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. భార‌త్ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కోసం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

కాగా భార‌త్ గ‌తంలో అణుప‌రీక్ష‌లు జ‌రిపిన‌ప్పుడు కూడా అమెరికా భారీగా ఆంక్ష‌లు విధించింది.. ఆ స‌మ‌యంలో భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా చిన్న‌ది.. ప్ర‌స్తుతం భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా మెరుగుప‌డింది. ప్ర‌పంచంలోనే భారీ మార్కెట్ ఉన్న భార‌త్ పై ఈ సుంకాల ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుందా? ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఉన్న‌త‌మైన భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్త‌పై అమెరికా సుంకాల ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప‌లువురు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య‌కు చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

 

త‌ప్ప‌క చ‌ద‌వండి: ర‌ష్యా, జ‌పాన్ ను తాకిన‌ సునామీ

1 Comment
  1. […] India vs US trade war: ప్ర‌తీకార చ‌ర్య‌లు ఉండ‌వు.. […]

Leave A Reply

Your email address will not be published.