విండీస్ పై ఘన విజయం.. విండీస్‌ని వైట్ వాష్ చేసిన భారత్..

కోల్‌కతా (CLiC2NEWS): కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టి 20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాదించింది. విండీస్ పై 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగు చేసింది. అనంతరం విండీస్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులను మాత్రమే చేసింది.
భారత్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 65 (7 సిక్సులు, ఒక ఫోర్ )పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 35, ఇషాన్ కిషన్ 34, శ్రేయస్ అయ్యర్ 25, రోహిత్ శర్మ 7 రుతురాజ్ 4 పరుగు సాధించారు. హోట్డర్, షేపర్డ్, చెస్, వాల్ష్, డ్రకెస్ ఒక్కో వికెట్ తీసారు.
లక్ష్య చేధనలో విండీస్ తడబడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా నికోలస్ పూరన్ మాత్రం దాటిగా ఆడాడు. 41 బంతుల్లో 61 పరుగులు చేశాడు. చివర్లో షేఫర్డ్ 29 పరుగు చేశారు.
భారత్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, షర్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు.
దీంతో మూడు టి20ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకు ముందు వన్డే సిరీస్‌ను కూడా భారత్ 3-0 తో సొంతం చేసుకుంది.