న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో భారత్ విజయం

దుబాయ్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును 205పరుగులకే ఆలౌట్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205పరుగులకు ఆలౌటయింది. న్యూజిలాండ్‌పై 44 పరుగులతో భారత్ లీగ్ దశను ఓటమి లేకుండా ముగించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది.
మంగళవారం టీమ్ ఇండియా జట్టా తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.