అండర్-19 మహిళల టి20 వరల్డ్ కప్ భారత్ కైవసం
హైదరాబాద్ (CLiC2NEWS): అండర్-19 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మెక్‌డోనాల్డ్ (19) టాప్ స్కోరర్.. భారత్ భౌలర్లలో టిటాస్ సదు, అర్చనాదేవి, పార్షవి తలా రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.
అండర్ 19 ప్రపంచకఫ్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు బిసిసిఐ రూ. కోట్ల నజరానా ప్రకటించింది.