ZIM vs IND: భారత్ 100 పరుగుల తేడాతో విజయం
జింబాబ్వేతో రెండో టి20 మ్యాచ్..

ZIM vs IND: జింబాబ్వేతో ఐదు టి20 ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ తడబడి 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా 100 పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేపై విజయం సాధించింది. అభిషేక్ శర్మ 100 శతకం సాధించాడు. రుతురాజ్ 77*, పరుగులతో జట్టు విజయానికి కారణమయ్యారు. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందుంచారు. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు 18 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటయ్యారు.
శనివారం భారత్ జింబాబ్వే మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో జింబాబ్వే 115 పరుగుల చేసింది. అతి చిన్న స్కోర్ అయినప్పటికీ భారత బౌలర్లు 102 పరుగులకే ఆలౌటయ్యి నిరాశపరిచారు. దానికి ప్రతీకారంగా రెండో మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు.