IND vs SL: లంకేయుల‌పై టీమ్ ఇండియా విజ‌యం..

 

తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై భార‌త్ 222 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 574-8 స్కోర్ వ‌ద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన లంక మొద‌టి ఇన్నింగ్స్ 174 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన శ్రీ‌లంక రెండో ఇన్నింగ్స్ లో 178 ప‌రుగులు చేసింది. ఒకే రోజులో టీమ్ ఇండియా 16 వికెట్ల‌ను తీసింది. వాటిలో ర‌వీంద్ర జ‌డేజా 8 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో ర‌వీంద్ర జ‌డేజా 175 (నాటౌట్‌) ప‌రుగులు చేశాడు. దీంతో జ‌డేజాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఈ క్ర‌మంలో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో క‌పిల్ (434)ను అశ్విన్ 436 అధిగ‌మించాడు. అంద‌రికంటే ముందు దిగ్గ‌జ బౌల‌ర్ అనిల్ కుంబ్లే (619) టాప్ లో ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.