ప్ర‌పంచ బాక్సింగ్‌లో స‌త్తా చాటిన భార‌త్‌

WBFs World Title:  డ‌బ్ల్యూబిఎఫ్ ప్ర‌పంచ బాక్సింగ్‌లో భార‌త బాక్స‌ర్ మ‌న్‌దీప్ ప్ర‌పంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ వేదిక‌పై బ్రిట‌న్ కు చెందిన బాక్స‌ర్‌ను చిత్తు చేసి సూప‌ర్ ఫెద‌ర్‌వెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు. కేమ‌న్ ఐలాండ్ వేదిక‌గా జ‌రిగిన డ‌బ్ల్యూబిఎఫ్ ప్ర‌పంచ బాక్సింగ్‌లో ప్ర‌త్య‌ర్థి కొనార్ మెకింతోష్‌ను ఓడించి మ‌న్‌దీప్ జంగ్రా భార‌త్ స‌త్తా చాటాడు. హ‌రియాణాకు చెందిన మ‌న్‌దీప్‌.. ఒలింపిక్స్ లో ర‌జ‌త ప‌త‌క విజేత రాయ్‌జోన్స్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్నాడు. ఈ టైటిల్ గెల‌వ‌డానికి ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాన‌ని.. నా దేశ కీర్తిని మ‌రింత పెంచ‌డం గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఇది నాజీవితంలో అతిపెద్ద విజ‌య‌మ‌ని , త‌న‌ని ప్రోత్స‌హించిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.