శ్రీలంకకు భారత్ ఆర్ధిక సాయం..

ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకు భారత ప్రభుత్వం 2.5 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 1.50 లక్షల టన్నుల ఇంధనాన్ని నాలుగు కంటైనర్లలో శ్రీలంకు పంపినట్లు భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే తెలిపారు. మరో ఐదు కంటైనర్లను మే నెలలో అందించనున్నట్లు వెల్లడించారు. ఇంధనం కోసం శ్రీలంకకు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆహారం, ఔషధాలు, అత్యవసర వస్తువుల కోసం మరో బిలియన్ డాలర్లు అందించాలని భారత్ గత నెలలో నిర్ణయించింది. ఇందులో భాగంగా బియ్యంతో కూడిన కంటైనర్‌లను త్వరలోనే శ్రీలంకకు చేరుకుంటాయని స్పష్టం చేశారు.