భారతీయులారా..! తక్షణమే కీవ్‌ను వీడండి..

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఉక్రెయిన్, రష్యా మధ్య బీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా బలగాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల గురించి కేంద్ర సర్కార్ పలు మార్గదర్శాకాలు జారీ చేసింది.
“కీవ్‌లో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు వెంటనే రాజధాని కీవ్‌ను విడాలని సూచనలు అందాయి. రైళ్లు, ఇతర రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయలుదేరాలి..“
అని ఉక్రయిన్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏ క్షణమైనా కీవ్ నగరంపై భీకర దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు భారతీయ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర సర్కార్ ఇప్పటికే ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే.
తప్పకచదవండి: